గది నిండా డబ్బులే.. లెక్కపెడితే 100 కోట్ల రూపాయలు..!

ఓ బెడ్ పట్టేంత స్థలంలో.. వంద కోట్లకు పైగా డబ్బులు.. కాన్పూర్ లోని ఓ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని స్వరూప్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఈ నోట్లకట్టలు దొరికాయి. రద్దుచేసిన రూ. 500, 1000 నోట్ల కట్టలు భారీ ఎత్తున పరుపులా పేర్చి ఉంచారు. జాతీయ దర్యాప్తు బృందాలు, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు. సీజ్ చేసిన పాత కరెన్సీ విలువ సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు పాత నోట్లను మారుస్తూ పట్టుబడ్డారు. అయితే ఇది మాత్రం నిజంగా పెద్ద మొత్తమే..! పెద్దనోట్లను రద్దు చేసి ఏడాది దాటినా ఇప్పటికీ పెద్ద మొత్తంలో పాత కరెన్సీ పట్టుబడుతోంది.

కాన్పూర్‌లో ఓ వ్యక్తి నివాసంలో రద్దు అయిన పాతనోట్లు భారీగా ఉన్నాయన్న పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్‌ నిర్వహించామని ఎన్.ఐ.ఏ. అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here