రంజాన్ మాసంలో మక్కా మ‌సీదులో ఆ ప‌ని చేస్తే ముక్తి ల‌భిస్తుంద‌ని.!

ప‌విత్ర రంజాన్ మాసంలో మ‌క్కా మ‌సీదులో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడో భ‌క్తుడు. ఉమ్రా యాత్ర‌కు వ‌చ్చిన ఓ పాకిస్తానీయుడు.. మ‌క్కా మ‌సీదు ఆవ‌ర‌ణ‌లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. సుమారు 50 మీట‌ర్ల ఎత్తు ఉన్న అంత‌స్తు నుంచి కిందికి దూకాడు. ఈ ఘ‌ట‌నలో అత‌ను అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు.

ప‌విత్ర రంజాన్ మాసంలో మ‌క్కా మ‌సీదులో ఆత్మ‌హ‌త్య చేసుకుంటే పుణ్యం వ‌స్తుంద‌ని, ముక్తి ల‌భిస్తుంద‌నే ఉద్దేశంతో ఆ భ‌క్తుడు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డి ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. మ‌క్కా మ‌సీదు ఆవ‌ర‌ణ మొత్తం భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఉమ్రా యాత్ర‌కు వ‌చ్చిన వేలాదిమంది భ‌క్తులు మ‌క్కా మ‌సీదులో ద‌ర్శ‌నం కోసం వెళ్తున్న స‌మయంలో న‌ల్ల‌టి దుస్తులు ధ‌రించిన ఓ వ్య‌క్తి.. రెయిలింగ్ ఎక్కి మ‌రీ, మూడో అంత‌స్తు నుంచి కిందికి దూకాడు.

దూక‌డం, దూక‌డంతోనే అత‌ని ప్రాణాలు గాల్లో క‌లిసి పోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌నే విష‌యాన్ని మ‌క్కా పోలీసులు ధృవీక‌రించారు. అత‌ను విదేశీయుడ‌ని, మ‌రిన్ని వివ‌రాల కోసం ఆరా తీస్తున్నామ‌ని వారు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

گزشتہ شب تراویح سے کچھ پہلے ایک شخص حرم مکی کے چھت سے صحن

عرب ٹی وی………… توبہ استغفراللہ گزشتہ شب تراویح سے کچھ پہلے ایک شخص حرم مکی کے چھت سے صحن (مطاف ) میں چھلانگ لگا کر خود کشی کر لی . نام اور شہریت کا ابتک پتہ نہ چل سکا .

Expresstimespkさんの投稿 2018年6月8日(金)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here