త‌మ పిల్ల‌ల కోసం అన్ని చోట్లా గాలించారు గానీ..!

ఒకే వీధిలో ఉండే ఓ అబ్బాయి, అమ్మాయి మూడు రోజుల నుంచి క‌నిపించ‌ట్లేదు. త‌మ పిల్ల‌ల కోసం వారి త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు వెత‌క‌ని చోటంటూ లేదు. అన్ని చోట్లా గాలించారు. స్నేహితులు, బంధువులు.. ఇలా ఏ ఒక్క‌ర్నీ వ‌ద‌ల‌కుండా విచారించారు. పోలీసుల‌కూ ఫిర్యాదు చేశారు. వారు కూడా గాలించిన‌ప్ప‌టికీ ఎక్క‌డా ఆచూకీ కూడా దొర‌క‌లేదు.

స‌రిగ్గా మూడోరోజు.. వారిద్ద‌రి మృత‌దేహాలు ఒకే చెట్టుకొమ్మ‌కు వేలాడుతూ క‌నిపించాయి. ఆ అబ్బాయి, అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దీనికి కార‌ణం- ప్రేమ‌. త‌మ ప్రేమ‌ను పెద్ద‌వారు అంగీక‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని వ్యారా తాపీ జిల్లాలో చోటు చేసుకుంది.

మృతుల పేర్లు కౌశల్ కుమార్ చౌధురి, గీతా బెన్ (పేరుమార్చాం). వ్యార తాపీ జిల్లాలోని డోల్వాణాలో ఉంటున్నారు. ఒకే వీధిలో నివ‌సిస్తున్నారు. కౌశ‌ల్ కుమార్ ప్ల‌స్ టూ విద్యార్థి. గీతాబెన్ ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. ఈ నెల 20వ తేదీన గీతా బెన్ త‌న స్నేహితుల‌తో క‌లిసి పొరుగునే ఉన్న అంథ‌ర్‌వాడి గ్రామంలోని స‌మీప బంధువు ఇంటికి వెళ్లింది.

 

అదేరోజూ కౌశ‌ల్‌కుమార్ కూడా బైక్‌పై ఆ గ్రామానికి వెళ్లాడు. ఆ త‌రువాత ఇద్ద‌రూ క‌నిపించ‌లేదు. దీనితో ఆందోళ‌న‌కు గురైన వారి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ జంట కోసం గాలిస్తుండ‌గానే 23వ తేదీన వారి మృత‌దేహాలు అంథ‌ర్‌వాడికి రెండు కిలోమీట‌ర్ల దూరంలో చెట్టుకొమ్మ‌కు వేలాడుతూ కనిపించాయి. ఆత్మ‌హ‌త్య‌కు ముందు వారిద్ద‌రూ సెల్ఫీ దిగారు. సంఘ‌ట‌నాస్థ‌లం నుంచి పోలీసులు బైక్‌, ఆత్మ‌హ‌త్య లేఖ‌ను స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here