15 రోజుల కింద‌టే ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేరాడు.. లైవ్‌లో సూసైడ్ చేసుకున్నాడు!

క‌ర్ణాట‌క స్పెష‌ల్ రిజ‌ర్వ్ పోలీసు కానిస్టేబుల్ ఒక‌రు లైవ్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతం ఇది. క‌ర్ణాట‌క చిక్‌బ‌ళ్లాపుర జిల్లాలోని చింతామ‌ణి తాలూకా మూడ‌చింత‌హ‌ళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. కానిస్టేబుల్ పేరు సునీల్ కుమార్‌. 15 రోజుల కింద‌టే శిక్ష‌ణ పూర్తి చేసుకున్నారు. బెంగ‌ళూరులోని హ‌ల‌సూరు కేఎస్ఆర్‌పీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప‌నిచేస్తున్నారు.

సెల‌వురోజు కావ‌డంతో శ‌నివారం రాత్రి ఆయ‌న మూడ‌చింత‌హ‌ళ్లికి వెళ్లారు. ఆదివారం మ‌ధ్యాహ్నం ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో.. త‌న గ‌దిలోకి వెళ్లి త‌లుపు వేసుకున్నారు. తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో చిత్రీక‌రించారు. అధిక మోతాదులో నిద్ర‌మాత్ర‌ల‌ను మింగారు. దాని ఫ‌లితంగా- ఏక‌ధాటిగా వాంతి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న త‌ల్లిదండ్రులు సునీల్‌కుమార్‌ను చింతామ‌ణిలోని ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం మెరుగైన చికిత్స కోసం బెంగళూరు హొస్కోటేలోని మ‌రో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ సునీల్‌కుమార్ మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌పై చింతామ‌ణి రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. సునీల్‌కుమార్ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here