అత‌ను చేసిన పాపం అదే: ఉరికించి, ఉరికించి కొట్టిన పోలీసులు

న్యూఢిల్లీ: రాంగ్‌రూట్‌లో వ‌చ్చిన ఓ బైక‌ర్‌ను అలా ఇలా కొట్ట‌లేదు పోలీసులు. ఉరికించి ఉరికించి కొట్టారు. దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలేక నేల‌మీద సొమ్మ‌సిల్లి ప‌డిపోయినా వ‌ద‌ల్లేదు. బ‌ర‌బ‌ర‌మంటూ ఈడ్చుకెళ్లారు. మ‌ళ్లీ కొట్టారు. త‌మ అక్క‌సునంతా తీర్చుకున్నారు.

ఇది ఢిల్లీ పోలీసులు సాధించిన ఘ‌న‌త‌. అంత ఘోరంగా పోలీసుల చేతుల్లో చావుదెబ్బ‌లు తిన్న ఆ బైక‌ర్ చేసిన పాపం..రాంగ్‌రూట్‌లో రావ‌డ‌మే. ఇత‌ర వాహ‌న‌దారులు అడ్డుకున్నా ఆప‌లేదు పోలీసులు. అమానుషంగా ప్రవర్తించారు.

ఓ వాహ‌న‌దారుడు దీన్ని వీడియో తీసి, సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ పటేల్‌ నగర్‌ మెట్రో స్టేషన్ స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బైక్‌పై రాంగ్‌ రూట్‌లో వస్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డగించి చలానా వేశారు.

అతడు చలానా కట్టకుండా పోలీసులతో వాదించాడు. దీనితో పోలీసులు రెచ్చిపోయారు. పోలీసులు అతడిపై దాడికి దిగారు. అతడు వారి నుంచి తప్పించుకునేందుకు పారిపోతుంటే.. పోలీసులు వెంటపడి చితకబాదారు.

ఆ వ్యక్తిని రోడ్డు మీదే ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. క్షమించమని.. కొట్టొద్దని అతడు ఏడుస్తూ వేడుకున్నా ప‌ట్టించుకోలేదు. ఆ వ్య‌క్తి వెంట బైక్‌పై వ‌చ్చిన అత‌ని భార్య పోలీసుల‌ను తీవ్రంగా ప్ర‌తిఘ‌టించింది. పోలీసుల చొక్కా ప‌ట్టుకుని నిల‌దీసింది.

అయిన‌ప్ప‌టికీ..వారు అదేమీ ప‌ట్టించుకోలేదు. ఆ బైక‌ర్‌ను కొట్ట‌డ‌మే త‌మ ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. తీవ్రంగా కొట్టడంతో అతడు సృహ కోల్పోయాడు.

చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్రంగా కొట్టడంతో అతడు సృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రిలో చేర్పించారు.

#Traffic #police walo ki gunda gardi #Delhi #Patel #Nager #MetroClip received from WhatsApp

Pankaj Narulaさんの投稿 2018年2月28日(水)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here