లైంగిక వేధింపులపై పూజా హెగ్డే స్పందన ఇది..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద రేంజిలో చర్చ జరుగుతూ ఉంది. అవకాశాలను ఇస్తామని చెబుతూ చాలా మంది అమ్మాయిలను మోసం చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద దుమారాన్నే రేపుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న పూజ హెగ్డే ఈ విషయంపై స్పందించింది.

తనకు ఇంతవరకు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎదురుకాలేదని… కానీ, వాటిని ఎదుర్కొన్నవారు తమ అనుభవాలను చెబుతుంటే చాలా బాధ కలుగుతుందని పూజా హెగ్డే తెలిపింది. ఈ రంగంలోకి అనేక కారణాలతో వస్తుంటారని… డబ్బు సంపాదన కోసం కొందరు, నటన మీద ఇష్టంతో మరికొందరు వస్తుంటారని.. అలాంటివారిని వేధింపులకు గురి చేయడం దారుణమని చెప్పింది. లైంగిక వేధింపులపై గట్టిగా పోరాటం చేయాలని అయితే అందరూ కలసి పోరాడితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపింది. ప్రస్తుతం పూజ హెగ్డే చేతుల్లో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం సాక్ష్యం సినిమా షూటింగ్ లో భాగంగా విదేశాల్లో ఉంది పూజ హెగ్డే. ఇటీవలే జిగేలు రాణి గా రంగస్థలంలో అలరించింది పూజ హెగ్డే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here