‘తెలుగుదేశం పార్టీ మీది’ అంటూ కళ్యాణ్ రామ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని..!

ఎమ్మెల్యే.. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న నటుడు పోసాని కృష్ణ మురళి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది హీరోలు అవుతారని.. వేల కోట్ల రూపాయిలు సంపాదిస్తారన్నారు. దీనికి హరికృష్ణ, కళ్యాణ్ రామ్ లు భిన్నమన్నారు. అందుకే కళ్యాణ్ రామ్ సక్సెస్ కావాలన్నారు. కళ్యాణ్ రామ్ సక్సెస్ అయితే ఇంకొంత మందికి ఉపాధి కలుగుతుందని.. అన్నారు.

అయితే ఇంకో మాట ఆయన నోటి నుండి రావడంపై టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. కళ్యాణ్ రామ్ నిజమైన ఎమ్మెల్యే కావటం తనకు ఇష్టమన్నారు. ఎందుకా మాట తాను చెబుతున్నానంటే.. తెలుగుదేశం పార్టీ మీది. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వస్తే ప్రజలు బాగుపడతారు. సమాజం బాగుపడుతుంది అని వ్యాఖ్యలు చేశారు. పోసాని వేరే ఉద్దేశ్యంతోనే ఈ మాటలు అన్నారని అందరూ స్పష్టంగా అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఒక్క నందమూరి బాలకృష్ణకు మాత్రమే సముచిత స్థానం కల్పించారని.. హరికృష్ణను కనీసం పట్టించుకోలేదని ఓ వర్గం భావిస్తోంది. అంతేకాకుండా యూత్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ కూడా టీడీపీకి దాదాపు దూరంగానే ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here