ఆ మృత‌దేహాల‌పై తీవ్ర గాయాలు..చిత్ర‌హింస‌ల త‌రువాతే చంపి ఉంటారంటూ అనుమానాలు!

క‌డ‌ప: జిల్లాలోని ఒంటిమిట్ట చెరువులో ల‌భించిన మృత‌దేహాలు త‌మిళ‌నాడుకు చెందిన వారివిగా నిర్ధారించారు. వారిని తమిళనాడులోని సేలం జిల్లా, కడుమదురైకి చెందిన మురుగేశణ్‌, కరియణ్ణన్‌, జయరాం, మురుగేశ్‌గా గుర్తించారు.

మృత‌దేహాల‌పై తీవ్ర గాయాలు ఉన్నాయ‌ని పోస్ట్‌మార్ట‌మ్ నివేదిక ద్వారా వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు. అయిదు మృత‌దేహాల‌కు సోమవారం ఉద‌యం క‌డ‌ప రిమ్స్ ఆసుప‌త్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. త‌మ రాష్ట్రానికి చెందిన‌వారు కావ‌డంతో త‌మిళ‌నాడు స్పెష‌ల్ బ్రాంచి పోలీసులు కూడా రిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లి వ‌చ్చారు.

మృతులు ఎర్ర‌చంద‌నం కూలీల‌ని, ఏపీ పోలీసులు వారిని ప‌ట్టుకుని, చిత్రహింస‌ల‌కు గురి చేసి, హ‌త్య చేసి ఉంటార‌ని త‌మిళ‌నాడులోని కొన్ని మాన‌వ హ‌క్కుల సంఘాల ప్ర‌తినిధులు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించాలంటూ త‌మిళ‌నాడుకు చెందిన ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here