వెంకీ కోసం మరో పవర్‌ఫుల్ టైటిల్ 

చాలా కాలం గ్యాప్ తీసుకున్నాక బాబు బంగారం లాంటి గట్టి ఫ్లాప్ తో వచ్చి `గురు’ తర్వాత కాస్త ఆ డామేజ్ ని కవర్ చేసుకున్నాడు వెంకీ, ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమాపై ఇన్నాళ్లు ఓ క్లారిటీ వచ్చింది. రానా తో నేనే రాజు నేనే మంత్రి చేసి కొత్తగా ఫామ్ లోకి వచ్చిన తేజ డైరక్షన్ లో వెంకటేష్ మూవీకి సర్వం సిద్ధం చేశారు. ఈ సినిమాకు టైటిల్ గా ఆటా నాదే.. వేటా నాదే అని పెడుతున్నారని తెలుస్తుంది. టైటిల్ తో అదృష్టం లాంటి సెంటిమెంట్ ఏమైనా ఫాలో అయ్యాడేమో.. గానీ రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన తేజ మరోసారి వెంకటేష్ తో అలాంటి ఓ పవర్ ఫుల్ సినిమాతోనే వస్తున్నాడట.

ఈ దర్శకుడు ఇంతకుముందు చిత్రం అనే టైటిల్ సక్సెస్ అవ్వగానే.. జయం.. నిజం.. ధైర్యం.. లాంటి టైటిల్స్ తో ఎక్కువగా కనిపించాడు. మళ్లీ ఇప్పుడు `నేనే రాజు, నేనే మంత్రి’ అని నాలుగు పదాల టైటిల్ తో హిట్ కొట్టిన సెంటిమెంట్ తోనే, తేజ ఈ సినిమాకు కూడా నాలుగు పదాల టైటిల్ ను పెట్టాడట. ఇక డిసెంబర్ 13 వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. కొద్ది రోజుల క్రితం ఇదే సినిమాకి `ఈ నగరానికి ఏమైందీ` అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

అయితే సుందరకాండ తర్వాత మళ్లీ ఇప్పుడు లెక్చరర్ పాత్రలో వెంకటేశ్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త కూడా ఉంది. ఈ చిత్రం మల్టీ స్టారర్‌గా రూపొందబోతోందని, నారా రోహిత్ లేదా సుమంత్ కీలకమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే అఫీషియల్ ప్రకటన వెలువడితే తప్ప ఏ విషయం అనేది చెప్పడం కష్టం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here