పవర్ లిఫ్టింగ్ లో ప్రపంచ ఛాంపియన్ ఈ భారతీయుడు.. దుర్మరణం పాలయ్యాడు..!

దేశ రాజధాని ఢిల్లీ శివారున అలీపూర్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రపంచ చాంపియన్‌ సక్షమ్‌ యాదవ్‌ సహా ఐదుగురు పవర్‌ లిఫ్టర్లు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా నలుగురు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన సక్షమ్ యాదవ్‌, సహాయకుడు బాలిలను మెరుగైన వైద్యం కోసం షాలిమర్‌బాగ్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యాదవ్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.

పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కానీ అతివేగం, కారులో మందు బాటిల్స్ కూడా దొరకడంతో వేరే కారణాలు కూడా ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. పానిపట్‌లో జరిగిన అథ్లెటిక్‌ మీట్‌లో పాల్గొని కారులో ఢిల్లీకి తిరిగి వస్తుండగా మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి రోడ్డు పక్కన స్తంభాన్ని ఢీకొంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, కారు బోల్తాపడిన తర్వాత కొంతదూరం దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రోహిత్ అనే వ్యక్తి ఒక్కడు ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నాడు. సౌరబ్, యోగేష్, హరీష్ రాయ్ ల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here