త్రివిక్ర‌మ్ మార్క్ డైలాగ్: `ఆడేదెక్కినా ఫ‌ర్లేదు గానీ..మ‌న‌ల్ని ఎక్క‌కుండా ఉంటే చాలు..`

ఈ మ‌ధ్య‌కాలంలో హ్యూజ్ హైప్‌ను క్రియేట్ చేసిన మూవీ `అజ్ఞాత‌వాసి..` ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లేటెస్ట్ మూవీ సంక్రాంతి సీజ‌న్ సంద‌ర్భంగా 10వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది.

ఈ మూవీ ట్రైల‌ర్‌ను శ‌నివారం అర్ధ‌రాత్రి విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ కోసం రోజంతా ఎదురు చూసిన అభిమానుల‌కు అర్ధ‌రాత్రికి గానీ కిక్ దొర‌క‌లేదు. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా న‌టించారు ఇందులో.

త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ దర్శకుడు. త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. ఇదివ‌ర‌కే రిలీజైన టీజ‌ర్‌.. అత్తారింటికి దారేదీ టైప్‌లో ఉందంటూ కామెంట్స్ రావ‌డంతో చిత్రం యూనిట్ కాస్త జాగ్ర‌త్త‌ప‌డింది.

ట్రైల‌ర్‌లో ఆ ఫీల్ రాకుండా జాగ్ర‌త్త‌ప‌డింది గానీ.. చిరంజీవి న‌టించిన `రౌడీ అల్లుడు`కు లేటెస్ట్ వ‌ర్ష‌న్‌లా ఉంద‌నే కామెంట్స్ అప్పుడే మొద‌ల‌య్యాయి కూడా.

ఫ‌స్ట్ టైమ్ ఆది పినిశెట్టి, ఖుష్బూ అఫీషియ‌ల్‌గా కనిపించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here