ప్ర‌భాస్ ప‌క్క‌న ఉన్న ఈ సెలెబ్రిటీ ఎవ‌ర‌బ్బా?!

ముంబై: రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప‌క్క‌న అణ‌కువ‌గా కూర్చున్న ఆ సెలెబ్రిటీ ఎవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం. ఆమె ఎవ‌రో కాదు.. బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ భార్య రుక్మిణి ముఖేష్‌. ప్ర‌స్తుతం రుక్మిణి గ‌ర్భ‌వ‌తి. త్వ‌ర‌లోనే ఆమె జూనియ‌ర్ నీల్ నితిన్ ముఖేష్‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా ముఖేష్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి ప్ర‌భాస్ వారి ఇంటికి వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా తీశారీ పిక్‌ను. దీన్ని రుక్మిణి ముఖేష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సాహో సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

https://www.instagram.com/p/BiWHeCOligo/?taken-by=neilnitinmukesh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here