ప్ర‌భాస్ పెళ్ళి ఇప్ప‌ట్లో లేన‌ట్లే!

బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పెళ్లి గురించి కూడా అభిమానుల్లో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ పెళ్లి విషయం గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయిది. తాజగా ఓ ఇంటర్వ్యూలో కృష్ణం రాజు పెళ్లి గురించి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

అతడే నిర్ణయించుకోవాలి: ప్రభాస్ కు పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది. అతడేం చిన్నపిల్లవాడు కాదు. ఈ విషయం గురించి అతడే నిర్ణయం తీసుకోవాలి అని కృష్ణం రాజు అన్నారు. ఈ వ్యాఖ్యలని బట్టి ప్రభాస్ సమీప భవిష్యత్తులో వివాహం చేసుకునేలా కనిపించడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here