తండ్రి ఆర్థిక పరిస్థితి తెలిసి.. అప్పట్లో సిటీ బస్సుల్లో వెళ్ళిన ప్రభాస్.. ఇదీ గతం..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు భారతదేశంలోనే టాప్ హీరోగా నిలిచాడు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఇప్పుడు సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు స్టార్డమ్ ఉన్నా కూడా ఏ మాత్రం గర్వం ప్రదర్శించని నైజం ప్రభాస్ ది. ప్రభాస్ తన కాలేజీ సమయంలో జరిగిన విషయాన్ని ఇటీవల మీడియాకు తెలిపాడు.

ప్రభాస్ సినిమా ఫ్యామిలీకి చెందినవాడన్న సంగతి అందరికీ తెలిసిందే..! ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు ఓ నిర్మాత. ఆయన నిర్మాతగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడట. అప్పట్లో డబ్బుల కోసం ఎన్నో అవస్థలు పడ్డామని చెప్పాడు ప్రభాస్. తాను కాలేజీకి బస్సుల్లో వెళ్ళే వాడినని.. అలా తాను బస్సుల్లో వెళ్ళినప్పుడు పెద్ద కుటుంబం కుటుంబం నుండి వచ్చిన పిల్లాడు అతడు.. పాపం బస్సుల్లో వెళుతున్నాడు అని అనేవాళ్ళని.. ఇలాంటివి విని తాను కష్టపడి పనిచేయాలని అనుకునేవాడినని ప్రభాస్ జీక్యూ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. జనవరి ఎడిషన్ జీక్యూ మ్యాగజైన్ మీద అతడి ఫోటో ప్రచురించారు.

అలాగే తన మొదటి సినిమా సమయంలో తాను తన తల్లి, సోదరితో కలిసి సినిమా చూశానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తనను తాను పెద్ద తెర మీద చూసుకొని భావోద్వేగానికి లోనైనట్లు తెలిపాడు. తాను సినిమాల నుండి రిటైర్ మెంట్ తీసుకుంటే రియలెస్టేట్ లోనూ, ఆక్వాకల్చర్ లోనూ డబ్బులను పెట్టుబడి పెడతానని చెప్పుకొచ్చాడు. అలాగే చేపలు పట్టడం కూడా ఇష్టమనే చెప్పుకొచ్చాడు డార్లింగ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here