కోర్టుకు రాని ప్రదీప్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం..!

యాంకర్ ప్రదీప్ కోర్టుకు హాజరవ్వడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రదీప్.. నేడు కోర్టు ముందుకు హాజరు కాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను కోర్టుకు రాలేకపోతున్నానని, రేపు హాజరవుతానని ప్రదీప్ తమకు సమాచారం అందించాడని పోలీసులు తెలిపారు. రేపు నాంపల్లి కోర్టుకు ప్రదీప్ హాజరవుతాడని గోషామహల్ పోలీసులు వెల్లడించారు.

వారం రోజుల తరువాత నిన్న కౌన్సెలింగ్ కు తన తండ్రితో కలసి ప్రదీప్ హాజరయ్యాడు. ఆ తర్వాత ఈరోజు కోర్టుకు ఆయన హాజరు కావాల్సి వుంది. కానీ హాజరు కాకుండా ఎగ్గొట్టేశాడు. ఇక రేపు కోర్టుకు రాకుంటే, అరెస్ట్ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేయాల్సి వుంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

డిసెంబర్ 31న రాత్రి మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు ప్రదీప్ పట్టుబడ్డాడు. మోతాదుకు మించి ఆయన మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తించిన పోలీసులు ఆయన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే వాహనదారుడి వాహనాన్ని సీజ్ చేసి శిక్ష అమలు చేస్తారు. అయితే.. ప్రదీప్‌కు బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయగా.. 170కి పైగా పాయింట్లు నమోదైంది. ప్రదీప్ కు శిక్ష పడే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున మీడియా నాంపల్లి కోర్టుకు చేరుకుంది. కానీ ఈరోజు ప్రదీప్ హాజరుకాడని తెలియడంతో నీరుగారి పోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here