నేను చేసిన తప్పును ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నా.. అంటూ వీడియో పోస్ట్ చేసిన ప్రదీప్..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు వార్తల్లో ఎక్కువగా నిలిచాడు. డిసెంబరు 31న రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయి పోలీసుల కౌన్సెలింగ్ కు హాజరు కాకపోవడం.. ఆ తర్వాత అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలపడంతో వివాదం పెద్దది అవుతోందని భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రదీప్ మాచిరాజు తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఆరోజు జరిగిన దానికి తాను చాలా బాధపడుతున్నాను.. తనలా ఇంకెవరూ చేయకండి అని ఆ వీడియోలో పోస్ట్ చేశాడు.

“నేను మీ ప్రదీప్ మాచిరాజు. డిసెంబరు 31న జరిగిన సంఘటన గురించి అందరికీ తెలుసు. పోలీసుల కౌన్సెలింగ్‌కు కానీ, దాని తర్వాత జరిగే ప్రొసీడింగ్స్‌కు కానీ హాజరయ్యేందుకు నేను సిద్ధంగా ఉన్నా. అయితే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రోగ్రామ్స్, ఇతర ఈవెంట్ల వల్ల కొంత బిజీగా ఉన్నా. షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్లే రాలేకపోయాను తప్పితే మరో కారణం ఏమీ లేదు.

ఫోన్ ఆగకుండా మోగుతుండడం వల్ల కొన్ని ముఖ్యమైన ఫోన్లను రిసీవ్ చేసుకోలేకపోయి ఉండొచ్చు. అందరికీ చెప్పేది ఏంటంటే.. చట్టప్రకారం ప్రొసీడింగ్స్‌ను ఫాలో అవుతాను. గతేడాది డ్రంకెన్ డ్రైవ్ గురించి చెప్పిన నేను దురదృష్టవశాత్తు అందులోనే దొరికిపోయాను. నేను చేసిన తప్పును ఇంకెవరూ చేయకూడదని కోరుకుంటున్నా. అందరూ నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’’ అని ప్రదీప్ ఆ వీడియోలో తెలిపాడు. ప్రదీప్ ఈరోజో.. లేక రేపో పోలీసుల కౌన్సిలింగ్ కు హాజరు అయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here