ప్రకాష్ రాజ్.. కన్నడ ఓటర్లకు చెబుతోంది ఒకటే..!

కర్ణాటక ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రేపు కన్నడ ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ తరుణంలో కన్నడ ఓటర్లకు తన మాటలుగా ప్రకాష్ రాజ్ కొన్ని వీడియో సందేశాలను ఇచ్చారు. ఎవరికైతే ఓటు వేస్తామో రేపు వారే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని గుర్తు చేశారు. ఆ విధానాలు మన జీవితాలను ప్రతిక్షణం ప్రభావితం చేస్తూనే ఉంటాయని హెచ్చరించారు. ఒకసారి ఆలోచించి ఆ తర్వాత వివేకంతో ఓటు వేయాలని కర్ణాటక ఓటర్లకు పిలుపునిచ్చారు.

గత కొద్ది రోజులుగా ప్రకాష్ రాజ్ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేస్తూ ఉండడమే కాకుండా.. ఆయన తన అభిప్రాయాలను తెలుపుతూ వస్తూ ఉన్నారు. ఇక ఓటు వేసేది మీరే మీ చేతిలోనే భవిష్యత్తు ఉంది అని నేడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను పెట్టారు. ఉజ్వల, సమ్మిళిత, భవిష్యత్తు భారతావని ఆవిష్కరణ విషయంలో ఇది మీ అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here