మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు అడుగుతున్న బీజేపీ అభ్యర్థి భార్యపై ప్రకాష్ రాజ్ ట్వీట్..!

ప్రకాష్ రాజ్.. భారతీయులను మతాల పేరుతో భారతీయ జనతా పార్టీ విడగొడుతోందని ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నారు. పలుమార్లు.. పలు వేదికలపై ఇదే విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కూడానూ..! తాజాగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ బీజేపీ అభ్యర్థి భార్య మతం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడాన్ని ప్రస్తావించారు.

“బీజేపీ అభ్యర్థి భార్య ఎలా ఓట్లను అడుక్కుంటోందో చూడండి. దక్షిణ కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో ఆమె మతాలను గుర్తు చేస్తూ తన భర్తకు ఓట్లు వేయాలని అడుగుతున్నారు. కమ్యూనల్ పాలిటిక్స్ సిగ్గుచేటు. ఇదేనా మీ ‘సబ్ కీ సాథ్ సబ్ కా వికాస్’ అని అడుగుతున్నాను” అని అన్నారు. బీజేపీ అభ్యర్థి భార్య మతాన్ని ప్రస్తావిస్తూ చేస్తున్న ఎన్నికల ప్రచార వీడియోను నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అందులో ఆమె తాను మంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న వేదవ్యాస్ కామత్ ధర్మపత్నిని. ఈ దఫా ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి నా భర్తను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన అని చెప్పింది.. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు హిందువులకు మంచి జరగాలంటే భారతీయ జనతా పార్టీ కర్ణాటకలోనూ, ఢిల్లీ లోనూ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండాల్సిందే అని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here