ఇంత అమాయకంగా చూస్తున్న ఈ మహిళ గర్భవతి.. ఏమి చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

మధ్యప్రదేశ్ లో ఓ భార్య కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేసింది. ఎందుకు చంపేశావు అని అడుగగా.. భర్తకు చర్మ వ్యాధి ఉందని అందుకే చంపేశానని చెప్పుకొచ్చింది. ఆమే గర్భవతి కూడా అని వైద్యులు స్పష్టం చేశారు. అంతేకాకుండా తనకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళి చేశారని.. అందుకే చంపేశానని కూడా చెప్పిందట.

భోపాల్ వద్ద ఉన్న ఖజూరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈట్ ఖేడీ గ్రామంలో నివసించే నీరజ్ మేవాడా శవం అతని బెడ్ రూమ్ లో లభించింది. అతడి ఒంటి మీద రక్తం ఉంది.. ఎవరో అతన్ని పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు. రెండు రోజుల తర్వాత అతడి భార్య నీతు మీద అనుమానం వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో తానే హత్య చేశానని చెప్పుకొచ్చింది.

శనివారం రాత్రి ఆమె తన భర్తను చంపేసింది. నీతు, నీరజ్ కోసం పై అంతస్థులో కుటుంబ సభ్యులు ఓ బెడ్ రూమ్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు కింద పడుకుంటే.. పైన భార్యాభర్తలు పడుకునే వారు. అయితే ఆ రోజు నీతు కుటుంబసభ్యులతో కలిసి కిందే పడుకున్నట్లు నటించింది. రాత్రి పైన ఉన్న బెడ్ రూమ్ కి వెళ్ళి భర్తను గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కిందకు వచ్చి పడుకునేసింది.

తన భర్త అంటే మొదటి నుండీ ఇష్టం లేదని చెప్పుకొచ్చింది నీతు.. ఇష్టం లేకుండా పెళ్ళి చేశారని చెప్పింది. ఇటీవల కాలంలో అతడికి చర్మ వ్యాధి కూడా రావడంతో తనకు అతడితో ఉండడానికి మనసు ఒప్పుకోలేదని చెప్పింది. ఇక చేసేది లేక భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించానని చెప్పుకొచ్చింది. ఆమె గర్భవతి కావడంతో పోలీసులు మొదట ఆమెను ప్రశ్నించడానికి కూడా సంశయించారు. ఎప్పుడైతే పోలీసులకు అన్ని సాక్ష్యాలు లభించాయో.. అప్పుడు ఆమెను విచారించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఒక్కతే భర్తను హత్య చేసిందా.. లేక వేరే వాళ్ళ ప్రమేయం కూడా ఉందా అన్న అంశంపై కూడా పోలీసులు ఆరాతీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here