టీమ్ ఓడిపోతున్నా, ఆమె ఆనందానికి కార‌ణం వేరే!

కొన్ని తెలుగు సామెత‌లు కొంద‌రికి అతికిన‌ట్టు స‌రిపోతుంటాయ్‌. తాజాగా- కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫ్రాంఛైజీ చీఫ్ ప్రీతిజింటా ప‌రిస్థితి అలాగే త‌యారైంది. త‌న టీమ్ ఓడిపోతున్న‌ప్ప‌టికీ.. ఉల్లాసంగా క‌నిపించింది ప్రీతిజింటా. ఆ ఆనందాన్ని త‌న కో ఫ్రాంఛైజీతో పంచుకుంటూ సంతోషంగా క‌నిపించిందామె. దీనికి కారణం- ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్‌కు క్వాలిఫై కాక‌పోవ‌డ‌మే.

చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్టుతో పుణే వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ ఓటమి చ‌వి చూసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి త‌ప్పుకొంది. దానికి ముందే- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. ఈ ఓట‌మితో ముంబై ఇండియ‌న్స్ కూడా ప్లే ఆఫ్‌ను అందుకోలేక చ‌తికిల ప‌డింది.

స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న స‌మ‌యంలో.. ఈ విష‌యం ప్రీతి జింటా చెవిన ప‌డింది. ముంబై ఇండియ‌న్స్ కూడా ప్లే ఆఫ్‌కు చేరుకోలేద‌నే స‌మాచారం తెలుసుకుంది. అప్ప‌టిదాకా లో ఓల్టేజ్ బ‌ల్బులా ఉన్న ప్రీతిజింటా ముఖం.. థౌజండ్ ఓల్టేజ్ బ‌ల్బులా వెలిగిపోయింది. `హ్యాపీ, వెరీ హ్యాపీ ముంబై హ్యాజ్ లాస్ట్. వెరీ హ్యాపీ` అంటూ కామెంట్ చేసింది. ఈ సంతోషాన్ని త‌న ఫ్రాంచైజీ పార్ట్‌న‌ర్‌తో పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

https://twitter.com/K3K_cube/status/998268371748737024

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here