రాష్ట్రపతి సంతకం కూడా పూర్తీ అయింది.. ఇక చిన్నారులను ముట్టుకోవాలంటే..!

చిన్నారులపై దారుణాతి దారుణంగా అత్యాచారాలు పెరిగిపోతుండడంతో వాటికి కళ్లెం వేసేందుకు కేంద్ర మంత్రి వర్గం రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలని కేంద్రం నిర్ణయించింది. లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే పోస్కో చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది.

12 ఏళ్లలోపు వారిపై అత్యాచారం చేసే నిందితులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. కేంద్ర కేబినెట్ నిన్న అత్యవసరంగా సమావేశమై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ (పోస్కో)’ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ ను ఆమోదించింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ఉమా భారతి, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పియూష్ గోయల్, హర్షవర్థన్ రాథోడ్, రవిశంకర్ ప్రసాద్, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఆర్డినెన్స్ జారీ అవుతుంది. చిన్నారులపై అత్యాచారం చేసే వారికి గరిష్టంగా మరణశిక్షతోపాటు మరెన్నో కఠిన శిక్షల్ని ప్రతిపాదించారు. ఇక కామంధులు చిన్నారులను ముట్టుకోవాలంటే భయపడాల్సిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here