క‌ళ్ల‌కు వ‌ర్చువ‌ల్ గ్లాస్ పెట్టుకుని..క్రికెట్ ఆడుతోన్న ఆ పెద్దాయ‌న ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా?

ల‌క్నో: చేతిలో బ్యాట్‌.. క‌ళ్ల‌కు వ‌ర్చువ‌ల్ గ్లాస్.. చాలా డిఫ‌రెంట్‌గా క్రికెట్ ఆడుతున్న ఆ పెద్దాయ‌న ఎవ‌రో ఠ‌క్కుమ‌ని గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే. ఎందుకంటే.. ఆ వ‌ర్చువ‌ల్ గ్లాసెస్ ఆయ‌న ముఖాన్ని పూర్తిగా క‌ప్పేశాయి కాబ‌ట్టి.

 

ఆయ‌నే మ‌న రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌. ఆయ‌న ఎదురుగా ఉన్న‌ది ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో ఏర్పాటైన పెట్టుబ‌డుల స‌ద‌స్సులో ఈ స‌న్నివేశం క‌నిపించింది.

 

పెట్టుబ‌డుల స‌ద‌స్సును ప్రారంభించ‌డానికి రాష్ట్రప‌తి కోవింద్ హాజ‌ర‌య్యారు. రాష్ట్రప‌తితో పాటు ప‌లువురు కేంద్ర‌మంత్రులు దీనికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను వారు ప్రారంభించారు.

అనంత‌రం వ‌ర్చువ‌ల్ స్టాల్ వ‌ద్ద‌కు వెళ్లిన‌ప్పుడు.. నిర్వాహ‌కులు దాని ప‌నితీరును రాష్ట్రప‌తికి వివ‌రించారు. దీనిపై ఆస‌క్తి చూపిన ఆయ‌న వ‌ర్చుక‌ల్ గ్లాస్ పెట్టుకుని మ‌రీ క్రికెట్ ఆడారు. ఈ ఫొటోను మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here