చిన్నారుల‌ను 15 అడుగుల ఎత్తు నుంచి కింద ప‌డేయ‌డం ఆచార‌మ‌ట‌!

బెళ‌గావి: ఏడాది కూడా నిండ‌ని చిన్న పిల్ల‌ల‌ను సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి కింద ప‌డేయ‌టం అక్క‌డి ఆచారం అట‌. అంత ఎత్తు నుంచి ప‌సివాళ్ల‌ను కింద ప‌డేస్తే ఇంకేమైనా ఉందా? ప‌్రాణాలు పోవూ? అందుకే- కింద న‌లుగురు వ్య‌క్తులు ఓ దుప్ప‌టి ప‌రిచి పట్టుకుని ఉంటారు. ఆ ప‌సివాడిని దుప్ప‌టిలో ప‌ట్టుకుంటారు.

అనాదిగా వ‌స్తోన్న ఈ సంప్ర‌దాయాన్ని పాటిస్తూనే వ‌స్తోందా గ్రామం. క‌ర్ణాట‌క‌ బెళ‌గావి జిల్లా అథ‌ణి తాలూకాలోని హుల‌గ‌బాళ గ్రామస్తులు దీన్ని అనుస‌రిస్తున్నారు. క‌ర్ణాట‌క‌-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ఉంటుందీ గ్రామం. ఈ గ్రామంలో బీరేశ్వ‌ర స్వామి దేవ‌స్థానం ఉంది. చుట్టు ప‌క్క‌ల గ్రామాలు వారు బీరేశ్వ‌రుడిని పూజిస్తారు.

ఉగాదితో పాటు కొన్ని పండుగ స‌మ‌యాల్లో ఈ ఆచారాన్ని అనుస‌రిస్తుంటారు. బీరేశ్వ‌ర స్వామి ఆల‌య పూజారి గుడి పైకెక్కి కూర్చుంటే.. ఆయ‌న‌కు ఆ ప‌సివాళ్ల‌ను అందిస్తారు.

ఆయ‌నేమో.. ఆ చిన్నారుల‌కు నుదుట బొట్టు పెట్టి, కాళ్లూ-చేతులూ ప‌ట్టుకుని అమాంతం 12 నుంచి 15 అడుగుల ఎత్తు నుంచి కింద ప‌డేస్తుంటారు. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా.. ఆ ప‌సివాడి ప్రాణాలు హుళ‌క్కే. కింద న‌లుగురు వ్య‌క్తులు దుప్ప‌టితో ప‌ట్టుకుంటారు. ఇది వారి ఆచారం. ఇలా చేస్తే.. త‌మ బిడ్డ‌ల‌కు బీరేశ్వ‌రుడు క‌రుణిస్తాడ‌నేది వారి విశ్వాసం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here