మన సీరియల్స్ లో లిప్ కిస్ లా..?

ఇతర దేశాలతో పోల్చుకుంటే మన సీరియల్స్ కాస్త పద్ధతిగా ఉంటాయని అనుకుంటారు. అందుకే మన లేడీస్ ఎక్కువగా సీరియల్స్ కు అతుక్కుపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇవి కూడా శృతి మించినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి దాకా డ్రామా, ఎమోషన్స్ ఉన్న సీరియల్స్ లోకి రొమాన్స్ కూడా చేరుతోంది.

ఇంతకూ ఏ సీరియల్ అనేగా మీ డౌట్.. పృథ్వీ వల్లభ్ టీవీ సీరియల్ లో..! ఈ సీరియల్ లో లీడ్ క్యారెక్టర్లు చేస్తున్న సోనారిక భదోరియా, ఆశీష్ శర్మలు లిప్ లాక్ లో మునిగిపోయారు. అది ఏకంగా ప్రోమోగా చూపించేశారు ఈ చిత్ర దర్శకనిర్మాతలు. ఈ టీవీ సీరియల్ జనవరి నుండి ప్రసారం అవుతోంది. ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదని మొదట్లో టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రోమోల ద్వారా అందరినీ ఆకర్షించాలని చూస్తున్నారు. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న సోనారికా తెలుగులో జాదూగాడు, ఈడోరకం ఆడోరకం, స్పీడున్నోడు సినిమాల్లో నటించింది. ఆమె హరహర మహాదేవ్ సీరియల్ లో పార్వతిగా నటించి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here