ప్రియ వారియర్ ఫేవరేట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?

ప్రియ వారియర్ ఫీవర్ తో సోషల్ మీడియా తెగ ఊగేస్తోంది. ఈరోజు కాస్త తగ్గింది కానీ.. రెండు రోజుల క్రితం పరిస్థితి వేరేగా ఉండేది. సోషల్ మీడియా తెరిస్తే చాలు అన్నీ ఆమె గురించీ పోస్టులే..! చాలా మందికి ఆమె ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. అయినప్పటికీ వీడియోను విపరీతంగా షేర్ చేసేశారు. అయితే తాజాగా ప్రియ వారియర్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది.

అందులో ఆమె ఇష్టాలను చాలా వరకూ బయటపెట్టింది. షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ లంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇక ఫేవరేట్ క్రికెటర్ అంటారా..! ప్రస్తుతం భారతజట్టులో ఎంతో మంది యంగ్ క్రికెటర్లు ఉన్నారు. వారిలో ఎవరో ఒకరి గురించి చెబుతుందని చాలా మంది ఊహించారు. అయితే వాళ్ళ పేరేమీ చెప్పలేదు ప్రియ. తన ఫేవరేట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పుకొచ్చింది.

36సంవత్సరాల ధోని అంటే తనకు చాలా ఇష్టమని ప్రియ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రియ వారియర్ కు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకు ఏకంగా 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు. అవకాశం వస్తే బాలీవుడ్ లో కూడా నటిస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here