ట్రెండ్ సెట్ చేసింది! రూపాయి నోట్ల మీదా ఆమె పేరే! ఆ నోట్ల‌కు ఫ్రేమ్ క‌ట్టిస్తార‌ట‌!

సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న కేర‌ళ కుట్టి ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ పేరు మారుమోగిపోతోంది. ఎంత‌గానంటే.. చివ‌రికి రూపాయి నోట్ల మీదా ఆమె పేరే క‌నిపిస్తోంది.

రూపాయి నోట్ల మీద రాత‌లు రాస్తే అవి చెల్ల‌వంటూ ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. అవి చెల్ల‌వ‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. జ‌నాలు ఆమె నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు. చ‌ల‌మాణిలో ఉన్న అన్ని డినామినేష‌న్ నోట్ల పైనా ప్రియా ప్ర‌కాష్ పేరును రాశారు.

ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ త‌మ అభిమానాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఎంత క‌ష్ట‌మొచ్చినా ఆ నోట్ల‌ను తాము వాడ‌బోమని, వాటిని ఫ్రేమ్ క‌ట్టిస్తామ‌ని అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here