అనుకున్న పని చేసిన ప్రియాంక.. నీరవ్ మోడీ లగ్జరీ కార్లు సీజ్..!

బాలీవుడ్ నటి.. ప్రస్తుతం క్వాంటికో టీవీ సిరీస్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా అనుకున్న పని చేసేసింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి చెక్కేసిన నీరవ్ మోడీ వజ్రాల కంపెనీకి తనకు ఎటువంటి సంబంధాలు.. లావాదేవీలు లేవని చెప్పేసింది. ఆయన ఉత్పత్తులకు ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నీరవ్ మోదీపై కేసులు నమోదైన నేపథ్యంలో ప్రచారకర్త బాధ్యతల నుంచి ఆమె తప్పుకుంది. నీరవ్ మోడీ ఇప్పటికే ఆమె డబ్బులు కూడా ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది.

 

నీరవ్ మోడీకి సంబంధించిన పలు కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నీరవ్ కు సంబంధించిన 9 విలాసవంతమన కార్లు సీజ్ చేశారు. ఇందులో రోల్స్ రాయ్, రెండు బెంజ్ కార్లు ఉన్నాయి. మరోవైపు నీరవ్ కు చెందిన ఫామ్ హౌజుల్లో రెండు రోజుల నుంచి సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. అటు నీరవ్ మోడీకి సంబంధించిన 7.80 కోట్లు, మెహుల్ చోక్సీ కంపెనీకి చెందిన 86 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ను ఫ్రీజ్ చేశారు. ఇక అతడి షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళకు జీతాలు కూడా నిలిచిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here