కన్నడ సూపర్ స్టార్ సినిమాలో అనంతపురం అమ్మాయి హీరోయిన్ గా ఫిక్స్..!

ప్రియాంక జవాల్కర్.. ఈ అనంతపురం అమ్మాయి ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తోంది. ఇంతలోనే మరో భారీ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకుంది. అదేమిటంటే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమాలో హీరోయిన్ గా..! ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది.

కన్నడ టాప్ డైరెక్టర్.. తెలుగులో పోటుగాడు సినిమా తీసిన పవన్ వడయార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ సరసన హీరోయిన్ గా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించింది. అయితే వారికి ప్రియాంక జవాల్కర్ నచ్చడంతో ఆమెను సంప్రదించారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేయడంతో సినిమా పట్టాలెక్కబోతోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందబోతోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మార్చి మొదటి వారం నుండి షూటింగ్ మొదలవనుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను మొత్తం పూర్తీ చేశారు. అనంతపురం అమ్మాయి ఈ విధంగా కన్నడ చిత్ర పరిశ్రమలో కాలుమోపనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here