క్లాస్ రూమ్ లో 37,000 రూపాయల ఫోన్ వాడుతూ అడ్డంగా దొరికిపోయారు..!

క్లాస్ రూమ్ లో ఫోన్ మాట్లాడుతూ లేదా వాడుతూ ఎప్పుడైనా అడ్డంగా దొరికిపోయారా..? ఒకవేళ దొరికింటే ఆ లెక్చరర్ ను ఎలాగో ఒకలా బ్రతిమాలి ఫోన్ ను తిరిగి తెచ్చుకోవచ్చు. మహా అయితే ప్రిన్స్ పాల్ దగ్గరకు కంప్లయింట్ పోతుంది. ఏ ఫైనో.. నాలుగు చీవాట్లు తినో తిరిగి తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం ఆ మొబైల్ ఫోన్ ఓనర్ ను ఎంతగానో బాధపెడుతుంది.

బెంగళూరుకు చెందిన ఓ లెక్చరర్ క్లాస్ లో ఉండగా ఇద్దరు విద్యార్థులు మొబైల్ ఫోన్ లో ఏదో చూస్తుండడం ఆయన గమనించారు. అంతే ఆయనకు కాలింది. వారి దగ్గరకు వెళ్ళి అతని చేతిలో ఉన్న ‘వన్ ప్లస్ 5టి’ ని వెనుకల బెంచ్ దగ్గర నుండి ముందుకు డయాస్ దగ్గరకు విసిరేశాడు. ఆ తర్వాత వారితో ఆ ఫోన్ ను పైకి తీయమని చెప్పాడు. దాన్ని విసిరేయ్ అని అడిగాడు.. ఆ కుర్రాడు విసిరేయకపోవడంతో ఆయనే మళ్ళీ ఇంకోసారి విసిరేశాడు. విపరీతమైన కోపంతో ఊగిపోయిన ఆయన వాళ్ళిద్దరినీ బయటకు తీసుకొని వెళ్ళాడు. బెంగళూరు లోని పి.ఈ.ఎస్.ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్లాస్ రూమ్ లో మొబైల్స్ వాడకూడదు అని చెబుతున్నా స్టూడెంట్స్ వినకపోవడంతో ఇలా లెక్చరర్లు కోపంతో ఊగిపోవాల్సి ఉంటుంది.

లెక్చరర్ చేసినది మంచి పనో.. లేక విద్యార్థి క్లాస్ రూమ్ లో ఫోన్ వాడడం తప్పో.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Using Phone In Class Can Be Risky

Disclaimer: The authenticity of this video could not be verified.

ScoopWhoopさんの投稿 2018年2月7日(水)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here