స్టేడియం లోకి పాములను వదులుతాం.. రాత్రికి చెన్నై-కోల్ కతా మధ్య మ్యాచ్..!

తమిళనాడు ప్రజలు.. ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే ఉద్యమాన్ని కూడా ఉదృతం చేస్తూ వస్తున్నారు. కావేరీ జలాల వివాదానికి పరిష్కారం చూపకుండా ఐపీఎల్ మ్యాచ్ లు ఎందుకని అంటూ ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరగబోయే మ్యాచ్ విషయంలో మాత్రం చెన్నై లోని చెపాక్ స్టేడియం వద్ద ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది.

ఒకవేళ మ్యాచ్‌ నిర్వహిస్తే స్టేడియంలో పాముల్ని వదులుతామని పీఎంకే నేత వేల్‌మురుగన్‌ హెచ్చరించడం కలకలం రేపుతోంది. నిరసనకారులు అడ్డుకునే అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి. స్టేడియం పరిసరాల్లో గందరగోళం చెలరేగకుండా చర్యలు తీసుకోవాలని సూచించాయి. ఆందోళనల నేపథ్యంలో మ్యాచ్‌ నిర్వహించే చెపాక్‌ స్టేడియం వద్ద 4 వేల మంది పోలీసులతో భద్రతను పెంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు ఈ మ్యాచ్ ను బాయ్ కాట్ చేయాలని పిలుపును కూడా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here