అరవింద్ స్వామి కొడుకు ట్యాలెంట్ ను గమనించారా..!

అరవింద్ స్వామి.. 90ల్లో దక్షిణాదిని ఊపేసిన నటుడు. అందం అంటే చాలు అరవింద స్వామిలా ఉండాలని చెప్పేవారు. ఇప్పుడు అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలన్ గా రాణిస్తూ ఉన్నాడు. అరవింద్ స్వామి తాజాగా తన కొడుకు గురించి సోషల్ మీడియాలో ఓ విషయం గురించి చెప్పుకొచ్చాడు. అరవింద్ స్వామి కొడుకు కదా ఏ సినిమాలోనే నటిస్తూ ఉండొచ్చు అని అనుకోకండి.. ఎందుకంటే అరవింద్ స్వామి కొడుకు గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఓ ట్వీట్ పెట్టాడు.

అరవింద్ స్వామి కొడుకు పేరు రుద్ర స్వామి.. ఐబీ ప్రోగ్రామ్ నుంచి రుద్ర స్వామి గ్రాడ్యుయేట్ కావడంతో అరవింద స్వామి చాలా సంతోషంగా ఉన్నాడు. గ్రాడ్యుయేట్ అయిన తన కొడుకు రుద్రస్వామిని చూసి గర్వంగా ఉందంటూ వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పుత్రోత్సాహముతో తన కొడుకు ట్యాలెంట్ ను బయట ప్రపంచానికి తెలియజేశాడు అరవింద్ స్వామి. ఏ తండ్రికైనా కొడుకు ప్రయోజకుడు అయితే వచ్చే ఆనందం కంటే ఇంకేమి కావాలి చెప్పండి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here