ఎందుకు ఫోన్ ఎత్తలేదు.. లవర్ కు వీడియో కాల్ చేసి ట్రైన్ కింద పడింది..!

ప్రేమికుల మధ్య చోటు చేసుకున్న చిన్న గొడవ అన్యాయంగా ఓ అమ్మాయి ప్రాణాలు తీసింది. డిసెంబర్ 14, 2017 న జార్ఖండ్ లోని తేలో రైల్వే స్టేషన్ వద్ద ఓ యువతి మృతదేహం పట్టాలపై కనిపించింది. ఆమెకు కొద్ది దూరంలో ఓ ఫోన్ కూడా పడి ఉంది. అమ్మాయిని 17 ఏళ్ల దివ్యా కుమారీగా గుర్తించారు. ఇప్పుడు ఈ కేసు మీద పోలీసులు ఆమె లవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మీనా కుమారి ఆత్మహత్యకు ప్రేరేపించింది ఆమె లవర్ అని పోలీసులు భావిస్తున్నారు. యువతి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ఆమె ఆత్మహత్య చేసుకునే రోజు తన లవర్ కు పలుమార్లు ఫోన్ చేసింది. అయితే ఆ యువకుడు ఆమె చేసిన ఫోన్ ను ఎత్తలేదు. దీంతో మనస్థాపం చెందిన ఆ యువతి ట్రైన్ కింద పడే ముందు అతడికి వీడియో కాల్ కూడా చేసింది. అతడు చూస్తుండగానే ఆమె ట్రైన్ కింద పడిందని పోలీసులు భావిస్తున్నారు.

ఆమె ప్రేమించిన సాహిల్ గుప్త గురించి ఆ యువతి కుటుంబ సభ్యులకు కూడా తెలుసునట..! వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. డిసెంబర్ 13న రాత్రి 3 గంటల వరకూ వారు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ దివ్య ఫోన్ చేస్తే సాహిల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె రైల్వే ట్రాక్ వద్దకు వెళ్ళి.. వీడియో కాల్ చేసి అతడు చూస్తుండగానే ఆత్మహత్య చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here