య‌స్‌! కాల్చింది నేనే!

చండీగ‌ఢ్‌: ప్రముఖ పంజాబీ గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు పర్మిష్ వర్మపై కాల్పులు జ‌రిపింది తానేనంటూ గ్యాంగ్‌స్ట‌ర్ దిల్‌ప్రీత్ సింగ్ వెల్ల‌డించాడు. దిల్‌ప్రీత్ సింగ్ పేరు మీద ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ మేర‌కు ఈ విష‌యాన్ని పోస్ట్ చేశారు. ప‌ర్మిష్ వ‌ర్మ‌పై శుక్ర‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌రువాత మొహాలీ స‌మీపంలో కాల్పులు జ‌రిగాయి.

ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న‌కు ప్రాణాపాయం త‌ప్పిన‌ప్ప‌టికీ.. బుల్లెట్ త‌గిలి ఆయ‌న గాయ‌ప‌డ్డారు. కాలి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ ప‌ర్మిష్‌ను ఫోర్టిస్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న అక్క‌డ చికిత్స పొందుతున్నారు. ఓ నైట్ క్లబ్ నుంచి కారులో ఇంటికి వెళ్తోన్న ప‌ర్మిష్‌పై కాల్పులు జ‌రిగాయి.

పర్మిష్‌పై తానే కాల్పులు జరిపినట్లు గ్యాంగ్ స్టర్ దిల్‌ప్రీత్ సింగ్ పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో ఒక ఫొటోలో గ్యాంగ్‌స్టర్ పిస్తోల్ పట్టుకుని ఉండగా.. మరో ఫొటోలో సింగర్ పర్మిష్ ఫొటోపై ఎరుపు రంగులో ఇంటూ మార్క్ వేశారు. వాస్తవానికి గ్యాంగ్ స్టర్ దిల్‌ప్రీత్ ఇప్పటికే ఓ హత్యకేసులో నిందితుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here