పీవీ సింధూ చేతిలో త్రివ‌ర్ణ ప‌తాకం

సిడ్నీ: కామ‌న్వెల్త్ గేమ్స్ ఆట్ట‌హాసంగా ఆరంభ‌మ‌య్యాయి. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో క‌రారే స్టేడియం ప్రారంభ వేడుక‌ల‌కు ఆతిథ్య‌మిచ్చింది. భార‌త‌ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మ‌న మువ్వెన్నెల జెండాను చేత పట్టుకుని మ‌న‌దేశ క్రీడాకారుల బృందానికి నాయకత్వం వహించారు.

ఈ గేమ్స్ కోసం వివిధ విభాగాల్లో మ‌న‌దేశం నుంచి మొత్తం 218 మంది క్రీడాకారులు పోటీ ప‌డ‌బోతున్నారు. 71 దేశాల తరఫున 6,600 మందికి పైగా క్రీడాకారులు త‌ల‌ప‌డ‌బోతున్నారు. మొత్తం 18 ఈవెంట్ల‌లో పోటీలు జ‌రుగుతాయి. మ‌న క్రీడాకారుల విష‌యానికి వ‌స్తే.. బ్యాడ్మింటన్‌, రెజ్లింగ్‌, షూటింగ్‌ విభాగాల్లో ప‌త‌కాలు గెలిచే అవ‌కాశం ఉంది. ఆయా విభాగాల్లో మ‌న దేశం బ‌లంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here