రాత్రిపూట బుస‌లు కొట్టే శ‌బ్దం వినిపిస్తోంటే ఏమిటో అనుకున్నాడు గానీ..

బ్యాంకాక్‌: గోడ‌కు చెవులుంటాయనే విష‌యాన్ని చెప్పారు గానీ.. గోడ‌లో పాములు, కొండ‌చిలువ‌లు కూడా దూరి ఆవాసం చేస్తాయ‌నే విష‌యాన్ని పెద్ద‌లు మ‌న‌కు చెప్ప‌లేదు. గోడ‌లో పాములు, కొండ‌చిలువ‌లు నివసిస్తాయ‌నే విష‌యాన్ని వారు ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. ఊహ కాదు..వాస్త‌వ ఘ‌ట‌న ఇది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో చోటు చేసుకుంది.

సోమ్‌చ‌య్ స‌బ్డంగ్ అనే వ్య‌క్తికి బ్యాంకాక్‌లో ఓ బంగ‌ళా ఉంది. త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నారాయ‌న‌. ఎప్ప‌టి నుంచి ఉంటుందో తెలియ‌ట్లేదు గానీ.. 15 అడుగుల పొడ‌వున్న ఓ భారీ కొండ‌చిలువ ఓ బంగ‌ళా గోడ‌లో నివ‌సిస్తూ వ‌స్తోంది.

థాయ్‌లాండ్ కదా! మ‌న‌లాగ గ్యాప్ లేకుండా గోడ‌ల‌ను క‌ట్టేయ‌రు. గోడ‌కు ఓ జానెడు జాగా వ‌దిలి ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో మ‌రో గోడ‌ను నిర్మిస్తారు. ఈ ఖాళీ స్థ‌లంలో నివ‌సించ‌డం మొద‌లు పెట్టిందో భారీ కొండ‌చిలువ‌.

అప్పుడ‌ప్పుడు రాత్రిపూట బుస‌లు వినిపిస్తుండ‌టంతో ఏమిటో అనుకున్నాడు గానీ.. త‌నతో పాటు త‌న లివింగ్ రూమ్‌లోనే ఈ ప్రాణి నివాసం ఉంటోంద‌ని తెలిసి ఉలిక్కిప‌డ్డాడు. వెంట‌నే పాముల సంర‌క్ష‌కుల‌ను పిలిపించాడు. గోడ‌ను ప‌గుల గొట్టి, కొండ‌చిలువ‌ను బ‌య‌టికి తీశారు. దాని పొడ‌వు 15 అడుగులు ఉంద‌ట‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here