భారీ కొండ చిలువ‌ను మెడ‌లో వేసుకుని..సెల్ఫీకి ఫోజివ్వ‌బోయాడు! అదేమో..!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తిఓ ఫారెస్ట రేంజ్ ఆఫీస‌ర్‌. పేరు సంజోయ్ ద‌త్‌. ప‌శ్చిమ బెంగాల్ జ‌ల్‌పాయిగురి అట‌వీ శాఖ అధికారి. ఆయ‌న మెడ‌లో వేసుకున్న‌ది ఓ భారీ కొండ చిలువ‌. భారీ అంటే అలాంటిలాంటి భారీ కాదు. అదో ర‌కం. 45 కేజీల బ‌రువు. 18 అడుగుల పొడ‌వు ఉన్న కొండ చిలువ అది.

బైకుంఠాపూర్ అడ‌వుల్లో దొరికిన ఆ కొండ‌చిలువ‌ను మెడ‌లో వేసుకుని, సెల్ఫీకి ఫోజివ్వ‌బోయాడు. అది ఊర‌కే ఉంటుందా? మెడ‌లో వేసుకున్న కాస్సేప‌టికే అది.. ఆ అధికారిని చుట్టేయ‌బోయింది. మెడ చుట్టూ ఓ రౌండ్ వేసేసింది కూడా. ఊహించని ఈ ఘ‌ట‌న‌తో అప్ర‌మ‌త్త‌మైన సంజోయ్ ద‌త్‌.. కొండ‌చిలువ‌ను విడిపించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆయ‌న శ‌క్తి చాల్లేదు. దీనితో చుట్టు ప‌క్క‌ల వారంద‌రూ ఓ చెయ్యేసి, ఆ కొండ చిలువ‌ను ప‌క్క‌కు త‌ప్పించారు.

అనంత‌రం దాన్ని సుర‌క్షితంగా బైకుంఠాపూర్ అడ‌వుల్లోనే వ‌దిలేశారు. బైకుంఠాపూర్‌లో ఓ మేక‌ను గుట‌కాయ స్వాహా చేసిన ఆ కొండ చిలువ క‌ద‌ల్లేని ప‌రిస్థితిలో ఉండ‌గా..గ్రామ‌స్థులు సంజోయ్‌ద‌త్‌కు స‌మాచారం ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here