రోడ్డుమ‌ధ్య‌లో కూరుకుపోయిన ట్ర‌క్కు.. టైరు కింద చూసి త‌న క‌ళ్ల‌ను తానే న‌మ్మ‌లేదు!

ఓ కొండ‌చిలువ‌. సుమారు ప‌ద‌డుగుల పొడ‌వు ఉంటుంది. రోడ్డు కింద..అంటే క‌ల్వ‌ర్ట్ లాంటి క‌ట్ట‌డంపై వేసిన రోడ్డన్న‌మాట‌. ఆ ప్ర‌దేశంలో రెస్ట్ తీసుకోవ‌డం దానికి అల‌వాటు.

ర‌ద్దీ మార్గంలో ఎలా వ‌స్తుండేదో, ఏమో గానీ ఆ ప్ర‌దేశానికి రెస్ట్ తీసుకోవ‌డానికొచ్చింది ఆ కొండ‌చిలువ. రోజుల‌న్నీ ఒకేలాగా ఉండ‌వ‌న్న‌ట్టు..పాపం!

ఆ రోజు మాత్రం ఆ కొండ‌చిలువ‌కు మృత్యువు విచిత్రంగా వెంటాడింది. ఆ రోడ్డు మీద వెళ్తోన్న ఓ ట్ర‌క్కు బ‌రువు రోడ్డు కుంగిపోయింది. స‌రిగ్గా ఆ కొండ‌చిలువ బ‌జ్జున్న ప్ర‌దేశంలోనే కుంగిపోయింది రోడ్డు.

దీని ఫ‌లితం.. ఆ ట్ర‌క్కు టైరు స‌రిగ్గా కొండ‌చిలువ శ‌రీరంపై నిల్చునిపోయింది. దాని బ‌రువుకు కొండ‌చిలువ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. దాని తోలు ఊడిపోయింది.

ఈ ఘ‌ట‌న- థాయ్‌లాండ్‌లోని ఛ‌ఛోయెంగ్‌సావోలో చోటు చేసుకుంది. ఆ ట్ర‌క్కు డ్రైవ‌ర్ పేరు ఛావాలిత్ థొంగ్‌సాడ‌. తాను ఇదే రోడ్డుపై వంద‌ల‌సార్లు ట్ర‌క్కును తీసుకెళ్లాన‌ని, ఈ సారి మాత్రం ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని అన్నాడు.

ట్ర‌క్కు కుంగిపోగానే.. కిందికి దిగి చూసే స‌రికి టైరు కింద కొండ‌చిలువ ఉంద‌ని, మొద‌ట త‌న క‌ళ్ల‌ను తానే న‌మ్మ‌లేక‌పోయాన‌ని అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here