రుద్రాక్ష ధ‌రించిన భార‌తీయుడిని ఉగ్ర‌వాదిగా చూపిన ప్రియాంక చోప్రా `క్వాంటికో`

క్వాంటికో సీరియ‌ల్‌. ఈ అమెరిక‌న్ సీరియ‌ల్‌లో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా న‌టించి ఉండ‌క‌పోతే దీని ప‌ట్ల పెద్ద‌గా ఎవ‌రికీ శ్ర‌ద్ధ ఉండేది కాదేమో. ప్రియాంక చోప్రా అందులో ఓ కీ రోల్ చేస్తుండ‌టంతో అభిమానుల క‌ళ్లు ఆ సీరియ‌ల్ మీదే నిలిచాయి. మ‌న‌దేశంలో ఈ సీరియ‌ల్‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది.

అలాంటిది- ఓ భార‌తీయుడిని ఉగ్ర‌వాదిగా చూపిందా సీరియ‌ల్‌. క్వాంటికో ఫోర్త్ సీజ‌న్‌లో దీనికి సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్ర‌సార‌మైంది. దీని ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మౌతోంది. రుద్రాక్షను ధ‌రించిన ఓ భార‌తీయుడిని ఉగ్ర‌వాదిగా పేర్కొంది చిత్రం యూనిట్‌.

మ‌న్‌హ‌ట్ట‌న్‌లో ఏర్పాటైన భార‌త్‌-పాకిస్తాన్ అత్యున్న‌త స‌మావేశంలో విధ్వంసం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది ఓ క్యారెక్ట‌ర్‌. ఈ స‌మావేశంలో విధ్వంసం సృష్టించి, పాకిస్తాన్ ఉగ్ర‌వాదులు చేసిన ప‌నిగా చూపుతారు ఇందులో. ఈ కుట్ర‌ను సాక్షాత్తూ భ‌గ్నం చేసేది కూడా ప్రియాంక‌చోప్రే.

 

ఆ ఉగ్ర‌వాదిని ప‌ట్టుకోవ‌డానికి వెళ్లిన సంద‌ర్భంగా వినిపించిన డైలాగుల‌తో పాటు- ధ‌రించిన రుద్రాక్ష‌ను చూసి, అత‌ను భార‌త్ నుంచి వ‌చ్చిన ఉగ్ర‌వాదిగా నిర్ధారిస్తారు. ఈ నెల 1వ తేదీన ప్ర‌సార‌మైన ఈ ఎపిసోడ్‌పై మ‌న‌దేశంలో విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here