ర‌క్కూన్..! ఎంత ప‌నిచేశావు

న్యూయార్క్‌: ర‌క్కూన్‌.. అమెరికా, దానికి ఆనుకునే ఉన్న కెన‌డాలో మాత్ర‌మే క‌నిపించే ఓ ర‌క‌మైన జంతువు. దాదాపు మ‌న‌వ‌ద్ద క‌నిపించే కుందేలు సైజులో ఉంటుంద‌ది. విమానాశ్ర‌యం గోడ దూకి.. ర‌న్‌వేపై అడుగు పెట్టింది. అక్క‌డితో ఆగిందా? లేదు. నేరుగా వెళ్లి.. బ‌య‌లుదేర‌డానికి రెడీగా ఉన్న ఓ విమానం ఏసీ వాల్వ్‌లోకి దూరింది.

ఏసీ వాల్వ్‌లోకి దూర‌డాన్ని దూరంగానే గ‌మ‌నించారు గ్రౌండ్ స్టాఫ్‌. ఈ విష‌యాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి తెలియ‌జేశారు. టేకాఫ్ తీసుకోవ‌ద్దంటూ పైలెట్‌కు స‌మాచారం ఇచ్చారు ఏటీసీ సిబ్బంది. అక్క‌డ మొద‌లైన ర‌క్కూన్ వేట.. సుమారు ఏడుగంటల పాటు సాగింది.

ఏసీ వాల్వ్‌లోకి దూరిన ర‌క్కూన్‌ను బ‌య‌టికి లాగ‌డానికి గ్రౌండ్ స్టాఫ్ ఆప‌సోపాలు ప‌డ్డారు. గ్రౌండ్ స్టాఫ్‌, ఎయిర్‌లైన్ స్టాఫర్స్, యానిమల్ కంట్రోల్ ఎక్స్‌పర్ట్స్ కలిసి దాన్ని బయటికి తీయడానికి తెగ ప్రయత్నించారు. చివ‌రికి చేత‌కాక‌.. విమానం ప్యానెల్స్‌ను కూడా విప్ప‌దీయాల్సి వ‌చ్చింది. అనంత‌రం దాన్ని బంధించి.. ద‌గ్గ‌ర్లోనే ఉన్న అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు.

దీని ఎఫెక్ట్‌.. విమాన స‌మ‌యంపై ప‌డింది. ఎప్పుడో మధ్యాహ్నం 2.50 కి బయలు దేరాల్సిన విమానం రాత్రి 10 గంటలకు గానీ క‌ద‌ల్లేదు. కెనెడా రాజ‌ధాని టొరొంటోలోని సస్కాటూన్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ర‌క్కూన్ వ్య‌వ‌హారంపై విసిగిపోయిన ప్ర‌యాణికులు.. తాము ఎదుర్కొంటున్న జాప్యంపై వ‌రుస‌గా ట్వీట్ల‌ను వదిలారు.

https://twitter.com/damienlee/status/992172038038216704

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here