బీచ్‌లో బికినీలో కాకుండా చీర క‌ట్టుకుని తిర‌గాలా?

ప‌నాజీ: గ‌తంలో ఓ బాలీవుడ్ మూవీ కోసం టాప్‌లెస్‌గా ఓ హాట్ సీన్‌లో బోల్డ్‌గా న‌టించిన రాధికా ఆప్టే.. అంతే బోల్డ్‌గా రెస్పాన్డ్ అవుతుంటుంది. మరోసారి సోషల్ మీడియాలో కొన్ని ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

#holiDay #timeoff #goa #sea #sunset #friends @marc_t_richardson #afteraswim

A post shared by Radhika (@radhikaofficial) on

గోవా బీచ్‌లో బికినీతో ఉన్న ఫొటోను ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజ‌న్లు కాస్త ఘాటుగా కామెంట్లు చేశారు. ఈ ఫొటో దెబ్బ‌కు ఆమె ట్రోల్ అయింది. తాను ఏది చేసినా నెటిజ‌న్లు విమ‌ర్శిస్తూనే ఉంటార‌ని చెప్పుకొచ్చింది. బీచ్‌లో తాను బికినీలో కాకుండా చీర క‌ట్టుకుని తిర‌గ‌మంటారా? అంటూ ఒంటికాలిపై లేచింది.

అస‌లు తనను విమర్శిస్తున్న వారెవరో కూడా తనకు తెలియదని, అలాంట‌ప్పుడు ఆ విమ‌ర్శ‌ల‌ను తానెందుకు పట్టించుకోవాలని ప్రశ్నించింది. ప్యాడ్‌మ్యాన్ సినిమాలో తన నటనకు సంబంధించి వస్తున్న రివ్యూలను ఇప్పటి వరకు చదవలేదని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here