కోహ్లి ఛాలెంజ్ కాదు.. తన ఛాలెంజ్ స్వీకరించమని అడిగిన రాహుల్ గాంధీ.. ఏమి ఛాలెంజ్ అంటే..!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఫిట్ నెస్ ఛాలెంజ్ జరుగుతోంది. కోహ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించారు. తాను కూడా ఒక వీడియోను పోస్ట్ చేస్తానని చెప్పారు. ఇంతలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రికి సోషల్ మీడియాలో ఇంకో ఛాలెంజ్ వేశారు.

రాహుల్ గాంధీ తన అకౌంట్ లో‘డియర్ పీఎం, విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ ఛాలెంజ్ కు అంగీకరించినందుకు సంతోషం. నేను మీకో ఛాలెంజ్ చేస్తున్నాను. ‘పెట్రో’ ధరలు తగ్గించండి లేకపోతే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ‘పెట్రో’ ధరలు తగ్గించాలని మీపై ఒత్తిడి చేస్తున్నాం. మీ ప్రతిస్పందన కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అంటూ ‘ఫ్యుయల్ ఛాలెంజ్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ ట్వీట్ చేశారు. దీనికి ప్రధానమంత్రి ఏమని స్పందిస్తారో చూడాలి.

ఇక వరుసగా 11వ రోజు ధరల్ని ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.85.29కి చేరింది. డీజిల్ ధర ముంబైలో లీటర్ 72.96కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 77.49గా ఉండగా, డీజిల్ ధర 68.53గా ఉంది. ధరల్ని నియంత్రించే ప్రణాళికపై కేంద్రం పనిచేస్తోందని, మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం వెలువడొచ్చని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. అది ఎప్పుడు జరుగుతుందో ఏమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here