మోడీ 4 ఏళ్ల పాలనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. ఎన్నిట్లో ఫెయిల్ మార్కులంటే..!

నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి నాలుగేళ్ళు అవుతోంది. దీనిపై ఈ రోజున నరేంద్ర మోడీ వరుసగా ట్వీట్లు చేశారు. ‘2014.. ఇదే రోజున, భారత్ లో మార్పు తీసుకురావడం కోసం మా ప్రయాణం ప్రారంభమైంది. గత నాలుగేళ్లుగా, అభివృద్ధి అనే అంశం సామూహిక ఉద్యమమై ప్రతిధ్వనిస్తోందని ఆయన ఓ ట్వీట్ లో చెప్పుకొచ్చారు’.

‘దేశాభివృద్ధి కోసం ప్రతి భారతీయుడు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాడు. 125 కోట్ల మంది భారతీయులు భారత్ ను ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్నారు. మా ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉంచిన ప్రతి భారతీయుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’నని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే నరేంద్ర మోడీ నాలుగేళ్ళ పాలనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. వ్యవసాయ రంగం లోనూ, ఫారెన్ పాలసీ లోనూ, ఇంధన ధరలు తగ్గించడం లోనూ, ఉద్యోగాల రూపకల్పన లోనూ ఫెయిల్ అయ్యారని ‘F’ ఇచ్చాడు. ఇక స్లోగన్స్ ను సృష్టించడం లోనూ, సొంత డబ్బా కొట్టుకోవడంలో Aప్లస్ సాధించారని రాహుల్ గాంధీ తన ట్వీట్ లో చెప్పారు. ఇక యోగా అంటారా దానికి కూడా Bనెగటివ్ ఇచ్చాడు రాహుల్..! అలాగే ఆయనలో ఉన్న మరికొన్ని రిమార్కుల గురించి కూడా రాహుల్ కౌంటర్ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here