రాహుల్ గాంధీ వేసుకున్న ఈ జాకెట్ ధరెంతో తెలిస్తే కళ్ళు తేలేస్తారు..!

కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి అందుకు కారణమైంది ఆయన చేసిన పనులో.. లేక ఆయన మాటలో కాదు.. ఆయన వేసుకున్న ఓ జాకెట్. జాకెట్ గురించి అంతగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందని అనుకుంటూ ఉన్నారా..? ఎందుకంటే దాని రేటు ఏకంగా 70వేల రూపాయలు.

బ్లూ డెనిమ్ ట్రౌజర్.. ఈ నలుపు రంగు జాకెట్ వేసుకొని షిల్లాంగ్ లోని ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ కు ఆయన హాజరు అయ్యారు. దాదాపు 4000 మంది ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా మేఘాలయ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ కార్యక్రమంలో ఆయన కేవలం 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. అయితే రాహుల్ గాంధీ వేసుకొని వచ్చిన నలుపు రంగు జాకెట్ గురించి మాత్రం తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఈ జాకెట్ విలువ 70000 రూపాయలట..! మేఘాలయ బీజేపీకి సంబంధించిన ట్విట్టర్ పేజీలో ఈ బ్లాక్ జాకెట్ కు సంబంధించిన ఫోటోను అప్లోడ్ చేశారు. ఇది 70వేల రూపాయలు విలువ చేస్తుందని.. నల్లధనంతోనే రాహుల్ గాంధీ ఈ జాకెట్ ను కొన్నారని ఆరోపించారు. బర్బెరీకి సంబంధించిన ఈ నలుపు రంగు జాకెట్ విలువ 68,145 రూపాయలు ఉంది. దీనిపై సోషల్ మీడియాలో పలు కామెంట్లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here