ప‌ట్టాల‌పై ముక్క‌లుగా..ముగ్గురి మృత‌దేహాలు! రైలు కింద ప‌డ్డారా? తోశారా?

చండీగ‌ఢ్‌: హ‌ర్యానాలోని యమునాన‌గ‌ర్ రైల్వేస్టేషన్ స‌మీపంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బుధ‌వారం తెల్ల‌వారు జామున రైలు ప‌ట్టాల‌పై ఓ మ‌హిళ, ఇద్ద‌రు పిల్ల‌ల మృత‌దేహాలు ల‌భించాయి. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా క‌ల‌వ‌రం చోటు చేసుకుంది.

య‌మునాన‌గ‌ర్ రైల్వేస్టేష‌న్ స‌మీపంలోని రైల్వేగేటుకు కొద్ది దూరంలో ఈ మూడు మృత‌దేహాలు ఛిద్ర‌మై క‌నిపించాయి. మృతులు ఎవ‌ర‌నేది ఇంకా తెలియ‌రావాల్సి ఉంది.

అర్ధ‌రాత్రి గానీ, తెల్ల‌వారు జామున గానీ వీరు రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌ని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య లేక హ‌త్య చేశారా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాల‌ను గుర్తించిన స్థానికులు రైల్వేపోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే రైల్వే పోలీసులు సంఘ‌టనాస్థ‌లానికి చేరుకుని మృతదేహాల‌ను పోస్ట్‌మార్ట‌మ్ కోసం త‌ర‌లించారు. అనంత‌రం ఈ కేసును సాధార‌ణ పోలీసుల‌కు బ‌ద‌లాయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here