ఇంటిముందు ఆడుకుంటూ మాయ‌మైన బాలిక‌లు..160 కిలోమీట‌ర్ల దూరంలో!

బెంగ‌ళూరు: బెంగ‌ళూరులో త‌మ ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్ద‌రు బాలిక‌లు..ఎక్క‌డో 160 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌రో న‌గ‌రంలో తేలారు. శ‌నివారం బెంగ‌ళూరు దాస‌ర‌హ‌ళ్లిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ముసుగు వేసుకున్న ఇద్ద‌రు వ్య‌క్తులు త‌మ‌ను క‌త్తితో బెదిరించి, అప‌హ‌రించార‌ని ఆ బాలిక‌లు చెబుతున్నారు.

దాస‌రహ‌ళ్లిలో ఇంటి ముందు ఆడుకుంటున్న మౌనిష (9), హ‌ర్షిత (10) తాము కిడ్నాప్‌న‌కు గురైన‌ట్టు చెబుతున్నారు. త‌మ‌ను అప‌హ‌రించిన వ్య‌క్తులు య‌శ్వంత్‌పుర రైల్వేస్టేష‌న్‌కు తీసుకెళ్లారని, అక్క‌డి నుంచి రైల్లో మైసూరుకు బ‌ల‌వంతంగా లాక్కెళ్లార‌ని చెప్పారు.

మైసూరు స్టేష‌న్‌లో దిగిన వెంట‌నే తాము త‌ప్పించుకుని, రైల్వే పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు చెబుతున్నారు. త‌మ పిల్ల‌లు క‌నిపించ‌ట్లేదంటూ మౌనిష‌, హ‌ర్షిత త‌ల్లిదండ్రులు అమృత‌హ‌ళ్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. త‌మ‌ను కిడ్నాప్ చేసిన వారెవ‌రో అంత‌కుముందు చూడ‌లేద‌ని చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు అనుమానితుల‌ను విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here