రైల్వేలో టీ కోసం టాయ్ లెట్ నీళ్ళను వాడిన వాళ్లకు ఏ శిక్ష విధించారో తెలుసా..?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. అదేమిటంటే కొందరు రైలులో టీ అమ్మే వాళ్ళు.. తమ టీ డబ్బాలను తీసుకొని టాయ్ లెట్ లోకి వెళ్ళి వచ్చారు. ఒకవేళ అతడు బాత్ రూమ్ కు వెళ్ళాలి అని అనుకుంటే.. టీ క్యాన్ ను బయటపెట్టి లోపలికి వెళ్ళి ఉండొచ్చు.. కానీ ఆ టీ లోకి నీటిని కలపడానికి బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. ఎవరూ చూడడం లేదులే అని అనుకున్నాడేమో.. కానీ ఓ వ్యక్తి మాత్రం వీడియో తీస్తూ ఉన్నాడు. ఏమీ చేయడం లేదు అని బుకాయించడానికి చూశాడు. కానీ అడ్డంగా దొరికిపోయారు.

ఇటీవలే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. దీనిపై భారతీయ రైల్వే స్పందించింది. గతేడాది డిసెంబర్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో ఈ ఘటన జరిగినట్లు గుర్తించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించామనీ దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. అయితే అతడికి విధించిన శిక్ష ఏమిటంటే.. టీ క్యాన్ వెండర్ కాంట్రాక్టర్ కు లక్ష రూపాయల పెనాల్టీ విధించినట్లు చెప్పింది. వీడియోలో కనిపించిన మరో ఇద్దరు వెండర్స్ కు లైసెన్సు లేదని గుర్తించారు. వాళ్ళను కూడా శిక్షిస్తానని చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here