సంచలన నిర్ణయం తీసుకున్న రైల్వే.. మార్చి 1 నుండే అన్ని చోట్లా అమలు..!

ఎప్పుడైనా రిజర్వేషన్ చేయించుకున్నామంటే.. ఆ బోగీ దగ్గరకు వెళ్ళి ఆ ఛార్ట్ లో మన పేరు ఉంది కదా అని ఎంతో ఆనందపడతాము. అలాగే మన పక్కన ఉన్న వాళ్ళ పేర్లు కూడా మనం తెలుసుకోవచ్చనుకోండి. అయితే ఈ ఛార్ట్ విధానంపై భారతీయ రైల్వే ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి రిజర్వేషన్ చార్ట్‌లను కోచ్‌లకు అంటించవద్దని దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లకు ఆదేశాలు అందాయి.

అయితే ఇదేమీ పూర్తిగా అందుబాటులో ఉండదు. కేవలం ఆరు నెలల పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే..! మార్చి 1 నుంచి ఆరు నెలల ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అయితే డిజిటల్ డిస్‌ప్లే చార్ట్‌లపై ప్రయాణికులు తమ వివరాలు చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ విధానాన్ని న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, హౌరా, సీల్దా స్టేషన్లలో అమలు చేస్తున్నారు. పేపర్‌లెస్ విధానానికి నాంది పలకడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం అని రైల్వే శాఖ వెల్లడించింది. పైగా ఇలా చేయడం వల్ల రైల్వేకు ఆదాయం కూడా పెరుగుతుందట. ప్రయాణికుల నుంచి సమకూరుతున్న ఆదాయం ఆధారంగా రైల్వే శాఖ స్టేషన్లను ఏ1,ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్‌గా ఏడుగా వర్గీకరించింది. మొత్తం 17జోన్లుగా పేర్కొంది. ఈ స్టేషన్లలన్నింటిలో డిజిటల్ డిస్‌ప్లే చార్ట్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికుల వివరాలను పేపర్‌పై అంటించడాన్ని పూర్తిగా నిలిపేయనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here