రైళ్ళలో మహిళల కోసం సరికొత్తగా.. చాలా మంచి ఆలోచన..!

రైళ్ళలో మహిళల సేఫ్టీ కోసం భారత రైల్వే సరికొత్తగా ఆలోచించింది. ఇప్పటిదాకా రైలులో ఎక్కడో చివరన ఉండే మహిళా బోగీలను.. ఇకపై మధ్యలోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా వాటికంటూ ప్రత్యేకంగా రంగును కూడా వేయించనున్నారు.


ప్రస్తుతానికి సబర్బన్ రైళ్లతోపాటు దూర ప్రాంత రైళ్లలోనూ అమలు చేయనున్నారు. సదరు మహిళా బోగీల్లో అదనంగా సీసీటీవీ కెమెరాలతోపాటు కిటికీలకు ఇనుప జాలీలను అమర్చే అంశాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తున్నది. రైళ్లలో ప్రయాణిస్తున్న మహిళలకు రక్షణ, భద్రత కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ, ట్రాఫిక్ సభ్యుడు మహ్మద్ జమ్‌షెడ్ తదితరులతో ఏర్పాటైన కమిటీ చర్చించింది. దీనిపై వివిధ రైల్వే జోన్ల నుంచి అభిప్రాయాలు కోరింది. మహిళా బోగీలను మహిళలు వెంటనే గుర్తించేందుకు వీలుగా వాటికి ప్రత్యేకమైన రంగులు కూడా వేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. మహిళా బోగీలకు గులాబీ రంగు వేయాలన్న విషయాన్ని రైల్వే శాఖ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ బోగీల్లో టిక్కెట్ తనిఖీ అధికారులను, రైల్వే భద్రతాదళం జవాన్లను కూడా మహిళలనే నియమించాలని రైల్వేశాఖ భావిస్తున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here