హీరో రాజ్ తరుణ్ తండ్రికి మూడేళ్ళ జైలు శిక్ష..!

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్.. అతడు ప్రస్తుత తరానికి ఎంతో ఆదర్శం. సినిమా పరిశ్రమ లోకి రావాలనుకునే వాళ్ళు రాజ్ తరుణ్ ను ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకంటే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటించి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా ఎదిగాడు. అయితే ఇప్పుడు అతడికి ఓ చెడు వార్త ఎదురైంది. ఆయన తండ్రికి మూడేళ్ల జైలు పడింది. రాజ్ తరుణ్ తండ్రి నిడమర్తి బసవరాజుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ, విశాఖపట్నం రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సన్నీ పర్విన్‌ సుల్తానాబేగం తీర్పిచ్చారు.

అందుకు కారణం ఆయన నకిలీ బంగారాన్ని కుదువ పెట్టడమే..! స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్ గా 2013 ప్రాంతంలో పని చేసిన ఆయన, నకిలీ బంగారాన్ని కుదవపెట్టి రుణం పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన భార్య రాజ్యలక్ష్మితో పాటూ చాలా మంది పేర్ల మీద నకిలీ బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాడట. మొత్తం రూ. 9.85 లక్షల రుణం పొందారు. ఆపై బ్యాంకు అధికారుల ఆడిటింగ్ లో ఈ విషయం బయటపడడంతో అడ్డంగా దొరికిపోయారు. అప్పటి బ్యాంకు మేనేజర్ గా ఉన్న గరికపాటి సుబ్రహ్మణ్యం చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. కేసు కోర్టుకు వెళ్లడంతో, విచారణ జరిపి ఈ తీర్పు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here