చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా ఎవరికి వారే.. అల్లుడికి కౌంటర్ ఇచ్చిన రజనీ..!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కాలా చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రజనీ హైదరాబాద్ కు వచ్చారు. ఆ గ్రాండ్ ప్రెస్ మీట్ లో భాగంగా తనకు హైదరాబాద్ తో ఉన్న అనుబంధాన్ని.. తెలుగు ప్రేక్షకులు తన మీద చూపిస్తున్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. అన్నగారు ఎన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణ రావు లేని లోటు తీరనిదని ఆయన చెప్పారు.

ఇక తన అల్లుడు ధనుష్ మాట్లాడుతూ రజనీ కాంత్ వన్ అండ్ ఓన్లీ అని అనడంపై కూడా రజనీ కౌంటర్లు వేశారు. ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుందని ఒకరే చిరంజీవి, ఒకరే నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా ఎవరికి వారేనని, ఎవరి ప్రాముఖ్యం వారిదని స్పష్టం చేశారు. మాంచి అవకాశాలు వారిని ఉన్నత స్థాయికి తీసుకొని వెళతాయని ఆయన అన్నారు. తనపై తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, తెలుగు వారూ అంతే ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.

కెరీర్ తనది తెలుగులోనే మొదలైందని.. కానీ ఒకానొక సమయంలో తనకు ఎక్కడ కొనసాగాలన్న సందేహం వచ్చిందని, అయితే, బాలచందర్ సినిమాతో తన కెరీర్ అక్కడే ప్రారంభం కావడంతో తమిళంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆ తర్వాత కూడా తన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారని రజనీ చెప్పారు. ఇక పెదరాయుడు బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా తన సినిమాలు వరుసగా తెలుగు ప్రేక్షకులు ఆదరించారని చెప్పుకొచ్చారు. ముంబై మురికివాడల నేపథ్యంలో తీసిన ‘కాలా’ సినిమాలోని ఐదారు పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాలా సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here